calender_icon.png 17 November, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు..కార్తీక వన భోజనాలు

17-11-2025 01:26:07 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), నవంబర్16:  తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి క్షేత్రానికి కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి మాలదారులు,భక్తులు అధిక పోటెత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం మధ్యాహ్నం యజ్ఞశాలలో మహాసౌర హోమాన్ని నిర్వహించారు.అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీర హనుమాన్,శ్రీరామకోటి స్తూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు.కార్తీకమాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో వనభోజనాలు ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకురాలు కాకులారపు రజిత జనార్దనస్వామి, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, లక్ష్మయ్య, మణికంఠ, అర్చకులు భీంపాండే, అంకిత్ పాండే తదితరులు పాల్గొన్నారు.