19-09-2025 01:09:25 AM
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రొటోకాల్ ఉల్లంఘనపై సీరియస్
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ప్రజాపాలన దినోత్సవం సంద ర్భంగా జెండా ఆవిష్కరణకు వచ్చిన గౌరవ అతిథిని స్వాగతించడానికి, జెండా ఆవిష్కరణకు కూడా సిరిసిల్ల కలెక్టర్ హాజరుకాకపోవ డంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా నిబంధనలు పాటించకపోవడాన్ని సర్కారు తప్పుపట్టింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం సిరిసిల్ల కలెక్టర్‌కు నోటీసులు జారీచేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోపు సంజాయిషీ ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు.
అసలేం జరిగింది..
ఈనెల 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణకు సిరిసిల్లకు విప్ ఆది శ్రీనివాస్ పేరును ప్రభత్వం ప్రకటించింది. సిరిసిల్లలోని పరేడ్ గ్రౌండ్‌కు గౌర వ అతిథి ఆది శ్రీనివాస్ వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్, ఎస్పీలు స్వాగతం పలకాలి. కానీ కలెక్టర్ రాలేదు. ఎస్పీ మాత్రమే స్వాగతం పలికారు. ఆ తర్వాత జెండా ఆవిష్కరణ, అతిథి ప్రసంగం కూడా పూర్తయ్యాయి.
చివరికి కార్యక్రమం ముగిం పు సందర్భంగా జాతీయ గీతం పాడేటప్పు డు కలెక్టర్ వచ్చారు. అదికూడా సైరన్ వేసుకొని వచ్చారు. దీనిపై విప్ ఆది శ్రీనివాస్ అప్పటికే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కలెక్టర్‌తో కనీసం కరచాలనం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై ముఖ్యమంత్రికి, సీఎస్‌కు ఫిర్యాదులు అందడంతో.. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈనేపథ్యంలోనే ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డ సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.