calender_icon.png 19 September, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా అవసరాల కోసం సీఎస్‌ఆర్ నిధులు వినియోగించాలి

19-09-2025 12:00:00 AM

చిట్యాల, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజా అవసరాలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కంపెనీ యాజమాన్యాలు సిఎస్‌ఆర్ నిధులను వెచ్చించాలని గురువారం భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 

చిట్యాల మండలంలోని వెలిమినేడు పీహెచ్ సి కేంద్రంలో, చిట్యాల పట్టణంలోని పిహెచ్ సి కేంద్రంలో  ఎంపిఎల్ కంపెనీ యాజమాన్యం 3 లక్షల విలువగల నిధులతో హాస్పిటల్స్ కు కావాల్సిన ఎక్విప్మెంట్, వైద్య పరికరాలను, వాటర్ ప్యూరిఫైడ్ ఫిల్టర్స్ ను , హెల్త్ అసిస్టెంట్లకు బిపి ఆపరేటర్స్ అందించారు. ఈ కార్యక్రమానికి ఆయన స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని ముందస్తు ప్రణాళిక లేకుండా అనవసర కార్యక్రమాలకు నిధులు వెచ్చించి నేడు అప్పుల ఊబిలో ఉంచిన ఘనత గత ప్రభుత్వ పాలకులదేనని విమర్శించారు. కంపెనీ యాజమాన్యం గ్రామీణ ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావలసిన మౌలిక వసతులను కల్పించి సామాజిక స్పృహను చాటాలని సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఎంపిఎల్ కంపెనీ యాజమాన్యం వైద్యరంగం తో పాటు విద్యారంగ అభివృద్ధి కోసం కృషి చేయాలని గ్రామీణ ప్రాంతాల పాఠశాలల లో మౌలిక వసతులను కల్పించి విద్యార్థుల అభివృద్ధికి దోహదం చేయాలని కోరారు. నకిరేకల్ నియోజకవర్గo దాదాపు 70 కిలోమీటర్ల పరిధి జాతీయ రహదారి విస్తరించి ఉన్నందున సీఎం త్వరలోనే జాతీయ రహదారిని గ్రీన్ హైవే గా రూపొందించే అవకాశం కూడా ఉంది అని అన్నారు.

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టడo అభినందనీయమన్నారు. చిట్యాల మండలంలో  డ్రై పోర్ట్ ఏర్పాటు కోసం ప్రభుత్వ ప్రతిపాదనలు పంపిందన్నారు.  ఏఎంసి చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, సింగల్విండో చైర్మన్ రఘుమారెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్వో వేణుగోపాల్ రెడ్డి, తాసిల్దార్ కృష్ణ నాయక్, ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మి,

మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, పొకల దేవదాస్, నాయకులు అంతటి నరసింహ పారిజాత, మాజీ సర్పంచ్ దేశపోయిన మల్లమ్మ, ఎంపిఎల్ కంపెనీ ప్రతినిధులు చైర్మన్ రామ్ నిరంజన్ అగర్వాల్, సీఈవో హితేష్ కుమార్ అగర్వాల్, విపి అజయ్ కుమార్, జిఎం నరసింహారావు, జిఎం సాధన్ బాబు, కరుణాకర్, డేవిడ్ రాజ్, నరేష్, ఆసిఫ్, వినయ్ రెడ్డి పాల్గొన్నారు.