calender_icon.png 19 September, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాల నివారణ అందరి బాధ్యత

19-09-2025 12:00:00 AM

-కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దు

-కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది..

-మంత్రి జూపల్లి కృష్ణారావు

ముషీరాబాద్, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): యువత జీవితాలకు ప్రమాదకరం గా మారిన మాదకద్రవ్యాల నివారణ సమాజంలో అందరి బాధ్యత అని రాష్ట్ర పర్యాటక, ఆబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు అన్నారు. హైదరాబాద్  హిమాయత్ నగర్ మఖ్డూమ్ భవన్ రాజ్ బహదూ ర్ గౌర్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజానాట్య మండలి నిర్వహించిన మాదకద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళారూపాల వర్కుషా ప్‌ను మంత్రి జూపల్లి కృష్ణ రావు ప్రారంభించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడు తూ తెలంగాణ ప్రజానాట్య మండలి నాటక బృందం  మాదకద్రవ్యాల నివారణ అవగాహన కల్పించడానికి రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయా లు, కళాశాలలు, పాఠశాలల వద్ద తమ కళారూపాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పిం చడం ద్వారా ఈ సమస్యను ఎదుర్కోవడంలో కళాకారులూ కీలక పాత్ర పోషించా లన్నారు.

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అన్ని వసతులు, సౌకర్యాలతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వైద్యం పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక ద్రుష్టి కేంద్రీకరించారని అన్నా రు. ప్రజలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పులపాలు కావద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని కోరారు. అంతకు ముందు ప్రజానాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన ఎంజా య్ పేరుతో గంజాయి వద్దురా ! మరియు కార్పొరేట్ వద్దురా ప్రభుత్వ ఆసుపత్రులు ముద్దురా ! అనే రెండు వీధి నాటకాలను మంత్రి జూపల్లి కృష్ణ రావు తిలకించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి  ఈ.టి. నరసింహ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్, సిపిఐ ఎమ్యెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. ఛాయాదేవి, సమితి సభ్యులు మరుపాక అనిల్ కుమార్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి. స్టాలిన్, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ తదితరులు పాల్గొన్నారు.