02-01-2026 12:00:00 AM
టీ20 వరల్డ్‌కప్‌కు ఆసీస్ జట్టు ప్రకటన
మెల్‌బోర్న్, జనవరి 1 : వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన జట్టుకు మిఛెల్ మార్ష్ నాయకత్వం వహించనుండగా పేస్ ద్వయం ప్యాట్ కమ్మిన్స్, జోష్ హేజిల్‌వుడ్ చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ గాయాల నుంచి కోలుకుంటున్నా రు. కమ్మిన్స్ పూర్తిగా కోలుకుని ఇటీవల యాషెస్ టెస్ట్ ఆడినా నాలుగో మ్యాచ్‌కు మళ్లీ రెస్ట్ ఇచ్చారు. అటు బిగ్‌బాష్ లీగ్ ఆడు తూ టిమ్ డేవిడ్ గాయపడ్డాడు.
అయినప్పటికీ ఈ ముగ్గురునీ సెలక్టర్లు ఎంపిక చేశారు. టోర్నీ ఆరంభ సమయానికి ఫిట్‌నెస్ సాధిస్తే ప్రపంచకప్‌లో ఈ ముగ్గురూ ఆడనున్నారు. ఈ నెల చివరి వారంలో కమ్మిన్స్ మరోసారి స్కానింగ్‌కు వెళ్లనున్నాడు. యాషెస్ టెస్ట్ సిరీస్‌లో ఆడిన కమ్మిన్స్‌కు వెన్నునొప్పి మళ్లీ ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడుతున్న హేజిల్‌వుడ్ ఇంకా ఫిట్‌నెస్ సాధించ లేదు.
ఉపఖండపు పిచ్‌లను దృష్టిలో ఉం చుకుని ప్రధాన స్పిన్నర్ ఆడమ్ జంపాతో పాటు సెకండ్ ఆప్షన్‌గా కూపర్ కన్నోలికి చోటు దక్కింది. స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా జో ష్ ఇంగ్లీస్‌ను మాత్రమే ఎంపిక చేశారు. దీంతో అలెక్స్ క్యారీ, జోష్ ఫిలిప్‌లకు నిరాశే మిగిలింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా గ్రూప్ బిలో ఉంది. ఇదే గ్రూపు లో శ్రీలంక , జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ ఉన్నాయి. ఆసీస్ తన తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో తలపడుతుంది.
టీ20 ప్రపంచకప్‌కు ఆసీస్ జట్టు :
మిఛెల్ మార్ష్ (కెప్టెన్), బార్ట్‌లెట్, కూపర్ కన్నోలీ, ప్యాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, హేజిల్‌వుడ్, ట్రా విస్ హెడ్, ఇంగ్లీస్, కున్నేమన్, మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, స్టోయినిస్, ఆడమ్ జంపా