02-01-2026 12:00:00 AM
ముంబై, జనవరి 1 : భారత క్రికెట్‌లో జట్టులో ఉన్న పోటీ కారణంగా పలువురు యువ ఆటగాళ్లు ఎంత బాగా ఆడుతున్నా చోటు దక్కడం లేదు. ఇదే కోవలోకి వస్తాడు యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా ఆ డుతున్నా సెలక్టర్లు అతన్ని ఎంపిక చేయడం లేదు. తాజాగా ఇదే అంశంపై మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ సెలక్టర్ల తీరును తప్పుపట్టాడు. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడం సిగ్గు చేటని వ్యాఖ్యానించాడు. అత ను మూడు ఫార్మా ట్లు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్‌గా చె ప్పుకొచ్చాడు.
ఒక్క ఫార్మాట్‌లో కూడా సర్ఫరాజ్‌ను ఎందు కు ఎంపిక చేయడం లేదో తనకు అర్థం కావ డం లేదన్నాడు. ఆటగాళ్లను రొటేషన్ పద్ధతిలో ఎంపిక చేసే సందర్భంలోనూ అతన్ని పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నాడు. అవకాశం ఇచ్చిన ప్రతీసారీ అతను సద్వినియోగం చేసుకున్నాడని గుర్తు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మెరిసిన అతను ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలోనూ అదరగొడుతున్నాడు.