calender_icon.png 1 October, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ దిమ్మెలకు పరదాలు

01-10-2025 12:00:00 AM

ములకలపల్లి, సెప్టెంబర్ 30, (విజయ క్రాంతి): రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. గ్రామాల్లో ఉన్న వివిధ పార్టీల దిమ్మెలకు, నాయకుల విగ్రహాలకు బయటకు కనిపించకుండా మండల పరిషత్, గ్రామపంచాయతీల సిబ్బంది పరాదాలను కప్పుతున్నారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామా ల్లో రాజకీయ సందడి నెలకొంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి.