01-10-2025 12:00:00 AM
పాల్వంచ రైతులకు సరిపడా యూరియా అందించండి: కనకేష్ పటేల్
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 30, (విజయక్రాంతి): యూరియా బస్తాల కోసం పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వేచి ఉంటున్న రైతు సోదర, సోదరీమణులకు బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ మంగళవారం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు.
ఆకలితో ఉన్నటువంటి రైతులు భోజనాలు చేసి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి కాంపెల్లి కనకేష్ పటేల్ తాము పడుతున్న ఇబ్బందులను చూసి తమకు భోజనాలు ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసి అయన చల్లగా ఉండాలని, భవిష్యత్తులో పేద ప్రజలకు మరిన్ని సహాయ, సహకారాలు అందించాలని, పేద ప్రజలకు ఏ ఆపద వచ్చిన వారి పక్షాన నిలబడాలని అన్నారు.
ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ పాల్వంచ మండలంలోని దూర ప్రాంతాల రైతులు యూరియా కోసం ఉదయాన్నే వచ్చి క్యూ లైన్ లో సాయంత్రం వరకు వేచి ఉంటున్నారని అందుకే వారికి మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నానని, మనకి అన్నం పెట్టే రైతుల కడుపు నింపడం చాలా సంతృప్తిగా ఉన్నదన్నారు.
పాల్వంచ పట్టణ, మండలంలోని రైతులకు సరిపడా యూరియాని తక్షణమే అందించాలని యూరియా అందక పొలాలు ఎండిపోతున్నాయని రైతులకు ఒక్క బస్తా, రెండు బస్తాలు యూరియా ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని రైతులకు సరిపడా యూరియా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సీజన్ లో రైతులు యూరియా కోసం అరిగోశ పడుతున్నారని, వచ్చే సీజన్ కు సరిపడా యూరియాను ముందుగానే సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవాలని, వచ్చే సీజన్ లో కూడా రైతులు ఇలాగే ఇబ్బంది పడితే ప్రభుత్వం మీద తిరుగుబాటు తప్పదన్నారు.
భవిష్యత్తులో యూరియా కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కి మరియు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు మారుమూళ్ల కిరణ్, పూజాల ప్రసాద్, కొట్టే రాఘవేంద్ర (రవి), ఆలకుంట శోభన్, మద్దిరాల అశోక్, వల్లపిన్ని వెంకటేశ్వర్లు, పోసారపు అరుణ్, కాంపెల్లి నవీన్, ఆలీ, కూరెళ్లి మురళి మోహన్, కల్తీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.