calender_icon.png 24 September, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతల విగ్రహాలకు ప్రజాధనం వెచ్చించొద్దు !

24-09-2025 01:13:50 AM

-తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు 

-కరుణానిధి విగ్రహ ప్రతిపాదనను తిరస్కరించిన న్యాయస్థానం

-నేతల కీర్తి కోసం ప్రజాధనం వినియోగించొద్దని స్పష్టీకరణ

చెన్నై, సెప్టెంబర్ 23: ‘మీ మాజీ నాయకులను కీర్తించడం కోసం ప్రజాధనాన్ని ఎం దుకు వాడుతున్నారు. అందుకు అనుమతి ఇవ్వం’ అంటూ సుప్రీం కోర్టు మంగళవారం తమిళనాడు ప్రభుత్వాన్ని మందలించింది. మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత కరుణానిధి విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వా లంటూ రాష్ట్రప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వల్లియూర్ కూరగాయల మార్కెట్ వద్ద కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది.

అందుకు సుమారు రూ. 30 లక్షల నిదులు కేటాయించి, పనులను సైతం ప్రారంభించింది. ప్రభుత్వ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. విగ్ర హాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, వెంటనే విగ్రహ ఏర్పాటు పనులను నిలిపివేయాలని ఆదేశించింది.

హై కోర్టు  తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తాజా గా జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ చేప ట్టింది. విగ్రహం ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. కింది కోర్టు తీర్పు సరైనదేనని సమర్థిస్తూ ప్రజాధనాన్ని ఇలాం టి పనుల కోసం దుర్వినియోగం చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. వెంటనే పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని, ఒకవేళ ఊరట కావాలనుకుంటే మద్రాస్ హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది.