23-07-2025 01:05:43 AM
చంపాపేట్ డివిజన్‌లో ఆర్యవైశ్య సమావేశం ఎదుట ఆందోళన
ఎల్బీనగర్, జులై 22 : ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షుడిగా అ మరవాది లక్ష్మీనారాయణ అప్రకటిత నియంతగా ఉన్నారని, వైశ్య మహాసభ బైలాను తుంగలో తొక్కి 11 ఏండ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతూ ఆర్యవైశ్యులను మోసం చేస్తున్నారని, ఆయన అధ్య క్ష పదవి చేపట్టిన రోజు నుంచి నేటి వరకు ఏ ఒక్క పేద ఆర్యవైశ్యుడికి మహాసభ ద్వారా సహాయం అందించలేదని ఆయన వెంటనే రాజీనామా చేసి కోర్టు తీర్పు ప్రకారం మహాసభకు ఎన్నికలు నిర్వహించాలని ఆర్యవైశ్య మహాసభ నాయకులు డిమాండ్ చేశారు.
చంపాపేట డివిజన్ లోని ఒక కన్వెన్షన్ హాల్ లో మంగళవారం ఆర్యవైశ్య మహాసభ సభ్యులకు తెలియకుండా తనకు అనుకూలంగా ఉన్నవారిని పిలిచి అమరవాది లక్ష్మీనారాయణ సమావేశాన్ని నిర్వహిస్తున్నాడని తెలు సుకున్న వైశ్యులు పెద్ద ఎత్తున కన్వెన్షన్ హాల్ ఎదుటకు చేరుకున్నారు. అనుమతి లేని వారిని లోపలికి పంపించవద్దు అంటూ బౌన్సర్లను పెట్టుకొని మరీ సమావేశం నిర్వహించారని, వెంటనే సమావేశాన్ని రద్దు చేయాలని వివిధ జిల్లాలకు చెందిన పలువురు నాయకులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అమరవాది హటావో... ఆర్యవైశ్య సంఘం బచావో అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు శ్యామ్ సుందర్ గుప్తా, మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా, ప్రేమ్ గాంధీ, బచ్చు శ్రీనివాస్ గుప్తా తదితరులు మాట్లాడారు. అమరవాది లక్ష్మీనారాయణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా అప్రకటిత నియంతగా మారి, ఆర్యవైశ్యులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా 11 ఏండ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతూ తనకు తానే జీవితకాలం అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారని విమర్శించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ్య మహాసభకు ఐదేకరాల భూమిని కేటాయించారని, ఈ స్థలాన్ని ఆర్యవైశ్య కార్పొరేషన్ కు అప్పగించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య సంఘం నాయకులుపాల్గొన్నారు.