10-11-2025 01:31:05 AM
హైదరాబాద్, నవంబర్ 9: సైబర్ నేరాలకు పాల్పడుతున్న 81మందిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 754 కేసులు, రూ.95వేల కోట్ల విలువైన మోసాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుల ఖాతాలోని రూ.కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు.