10-11-2025 01:30:54 AM
-సర్కారు చర్యలు వట్టిమాటేనా!
- పోలీసుల ఉక్కుపాదం ఉత్తదేనా?
-జేఎన్టీయూ ర్యాగింగ్ నేపథ్యంలో మళ్ళీచర్చ
కరీంనగర్ , నవంనర్9(విజయక్రాంతి)జగిత్యాల జిల్లా నాచుపల్లి జె ఎన్ టి యూ లో చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటన వెనుక మత్తు పధార్తల వినియోగం కారణంగా తెలిస్తుంది. జగత్యాల జిల్లాలో గంజాయి రవా ణా, విక్రయం, వినియోగం ఎక్కువగానే ఉం టుంది.ఈ జిల్లాలో గంజాయికి సంబంధించిన కేసుల నమోదులో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది అంటే అర్థం చేసుకోబచ్చు. జిల్లాలో 2021 సంవత్సరంలో 14 గంజాయి కేసులు నమోదు కాగా 38 మంది ని పోలీసులు అరెస్టు చేసి 30 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
2022 సంవత్సరంలో 11 కేసులు నమోదు కాగా 32 మందిని అరెస్టు చేసి 18.42 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 2023 సంవత్సరంలో 13కేసులు నమోదు కాగా 36 మందిని అరెస్టు చేసి 91.54 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 2024 సంవత్సరంలో 50 కేసులు నమోదు కాగా 135 మందిని అరెస్టు చేసి రూ.16,43, 199 విలువ గల 68.36 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు 60 కేసులు నమోదు కాగా 138 మందిని అరెస్టు చేశారు. ప్తతి ఏటా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.
ఈ జిల్లాలో మైనర్లు, విద్యార్థులు, యువతనే టార్గెట్గా చేసుకొని కొన్ని ముఠాలు వారికి గంజాయి అలవాటు చేసి విక్రయిస్తున్నాయి. ముఠా సభ్యులు కొందరు పలువురు విద్యార్థులకు డబ్బు ఆశ చూపి వారితో గంజాయి రవాణా చేయిస్తున్నాయి. తాజాగా విశాఖ, సీలేరు ప్రాంతాల నుంచి జగిత్యాలకు గంజా యి తీసుకువస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు భద్రాచలం నుంచి జిల్లాకు అక్రమంగా గం జాయి రవాణా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కువగా మత్తుకు బానిస అవుతుం డటం ఆందోళన కలిగిస్తున్న అంశం.జె ఎన్ టి యూ సీనియర్ల పైశాచిక ఆనందం వెనుక కారణాలను పోలీసులు శోధించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. కొన్నేళ్లుగా ర్యాగింగ్ అంతగా లేదు. అయితే ఇటీవల మళ్లీ సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ పేరిట వేధించడం మొదలు పెట్టడం వెనుక గంజాయి వినియోగం పెరగడమే కారణం అంయిన్నారు మానసిక నిపుణులు. తాజాగా జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలోని నాచుపల్లిలోని జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం రేపింది.పరిచయ కాటుఅక్రమం పేరుతో సీనియర్లు జూనియర్లు ర్యాగింగ్ చేశారు. బీటెక్ సెకండియర్ విద్యార్థులు కొత్తగా చేరిన వారిని మానసికంగా వేధించారు.
వారి వేధింపులతో భయపడిన పలువురు విద్యార్థులు తరగతులకు హాజరు కాలేదు.ఈ ఘటనపై జూనియర్లు కాలేజీ ప్రొఫెసర్లకు, అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా కానీ పట్టించుకోలేదు దీనితో ర్యాగింగ్ భూతం మళ్ళీ జడలు విప్పుతుందన్న భయం తల్లితండ్రుల్లో నెలకొంది.రాష్ట్రంలోని ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ఒకప్పుడు ర్యాగింగ్ ఘోరంగా ఉండేది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కాలేజీల్లో సీనియర్ల వేధింపులతో జూనియర్లు ఆత్మహత్యలు సైతం చేసుకున్న ఘటనలు ఉన్నాయి. 2010కి ముందు ర్యాగింగ్ తీవ్రంగా ఉండేది.
దీంతో సీనియర్లు కనిపిస్తే జూనియర్లు భయపడే వారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడం మార్పు వచ్చింది. ర్యాగింగ్ జరిగితే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని కాలేజీల్లో యాంటి రాగింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు.. దీంతో అప్పటి నుంచి ర్యాగింగ్ అంతగా లేదు.అయితే రాష్ట్రాల్లో ఇటీవల మళ్లీ ర్యాగింగ్ కలకలం రేపుతుంది. నల్లగొండ మెడికల్ కాలేజీలో ఇటీవల ఫస్ట్యిర్ వైద్య విద్యార్థులను రెండో ఏడాది చదువుతున్న సీనియర్లు ర్యాగింగ్ చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినందుకు మరోసారి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అయితే ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్, వెబ్ సిరీస్‌ల ప్రభావంతో చాలా మంది యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. సమాజాన్ని, చట్టాలను లెక్క చేయడం లేదు. ఈ క్రమంలో ర్యాగింగ్ ఘటనలు సైతంపెరుగుతున్నాయి.