calender_icon.png 10 November, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాసభల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

10-11-2025 01:37:10 AM

రాజేంద్ర నగర్ నవంబర్ 9, ( విజయక్రాంతి ): ఈ నెల 10,11 వ తేదీల్లో కాటేదాన్లో  సిఐటియు రంగారెడ్డి జిల్లా 4వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బచ్చలకూర స్వామి తెలిపారు. ఆదివారం రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని  కాటేదాన్ బుద్వేల్ లేబర్ అడ్డావద్ద మహా సభల గోడ పత్రిక ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కుల కోసం ఉన్న 44 చట్టాలు రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మారుస్తున్న విధానాలను రద్దు చేయవలసిందిగా నాలుగు లేబర్  కోడ్ ల వల్ల కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందని  ఇది  ఇలా నే  కొనసాగితే కార్మికులకు ఉన్న హక్కులు పూర్తిగా హరించిపోతాయని... కార్మికులకు నష్టం కలిగించే ఈ విధానాన్ని వెంటనే  వెనక్కి తీసుకోవాలని కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.