19-05-2025 09:09:54 PM
జయశంకర్ భూపాలపల్లి (విజయక్రాంతి): పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైనిక దళం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో ఆర్ఎంపీలు 150 అడుగుల త్రివర్ణ జాతీయ పతాకంతో తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. భారత సైనిక దళాలకు మనమంతా సంఘీభావంగా నిలవాలని పేర్కొన్నారు.
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.పి, పి.ఎం.పి అసోసియేషన్ మండల అధ్యక్షుడు నడిగోట్టి రాములు, మాజీ జెడ్పిటిసిలు మోటపోతుల శివశoకర్ గౌడ్, ముత్యాల రాజయ్య, మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ, మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరి శ్రీనివాస్, బిసి సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తిని శివశంకర్ గౌడ్, మండల సమైక్య ఏపిఎం ఇమామ్, భూపాలపల్లి జిల్లా ఆర్ఎంపి పి.ఎం.పి అసోసియేషన్ చైర్మన్ చాగర్తి లక్ష్మీనారాయణ, ఎథిక్స్ కమిటీ చైర్మన్ కూతురు రమణ, జిల్లా కోశాధికారి దౌడు రమేష్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ దూలం కుమార్, రాష్ట్ర నాయకులు వైనాల వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, కోశాధికారి అజ్మత్ తదితరులు పాల్గొన్నారు.