calender_icon.png 9 August, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళిత జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కమిటీలో అవకాశం కల్పించాలి

09-08-2025 12:25:24 AM

కొత్తకోట ఆగస్టు 8 : దళిత జర్నలిస్టులకు అక్రీడెషన్ కమిటీలో అవకాశం కల్పించాలని, దళిత జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్ అన్నారు. శుక్రవారం కొత్తకోటలో ఏర్పా టు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ అభయహస్తం కింద 12 లక్షలు ఇవ్వాలని, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వచ్చే నెలలో హైదరాబాద్ లో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తామని ఈ సభలకు రాష్టంలోని నలుమూలల నుండి దళిత జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. దళిత జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు.

బీసీ రిజర్వేషన్ కు దళిత జర్నలిస్టుల ఫోరం సంపూర్ణ మద్దతు బీసీల 42 శాతం రిజర్వేషన్ న్యాయమైనదని, ఈ పార్లమెంటు సమావేశంలో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని, దళిత జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు అనిల్ కుమార్, ఈశ్వర్, మురళి, దళిత నాయకులు కిరణ్, లక్ష్మణ్, దాస్ పాల్గొన్నారు.