calender_icon.png 9 August, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పండుగ సాయన్న జయంతి

09-08-2025 12:26:19 AM

ఆలేరు, ఆగస్టు 8 (విజయ క్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో టైగర్ ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రజా వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్, స్వేచ్ఛ, స్వాతంత్ర, సమానత్వం కోసం, పెత్తందారీ వ్యవస్థపై రాజీలేని పోరాటం చేసిన పోరాట యోధుడు, బహుజన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన సూర్యుడు, సామాజికవేత్త  అని పేర్కొన్నారు. కానీ  ఆధిపత్య శక్తులైన దేశముక్కులు, కరణం పటేళ్లు,  భూస్వాములు,  పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయన్నను చంపించారు. పండుగ సాయన్న మా యాదిలో ఎల్లప్పుడూ ఉంటాడని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.