09-08-2025 12:23:14 AM
నకిరేకల్, ఆగస్టు 8 : బీహార్ ఎన్నికల్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిరసిస్తూ సిపిఎం కేతపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ బీహార్లో ఓటర్ల సమగ్ర ప్రత్యేక సవరణ కార్యక్రమం పేరుతో బిజెపి కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి ఓట్లను తొలగించే కార్యక్రమం చేపట్టిందని ఆయన విమర్శించారు.
ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. దళితులు మైనార్టీల ఓట్లను తొలగిస్తూ పేదలు మైనార్టీల రాజ్యాంగ హక్కులను కాల రాస్తున్నారని అని అన్నారు ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి ఈ దురాగతా లను ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండిం చాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్ర మంలో సిపిఐ యం పార్టీ మండల కార్య దర్శి చింతపల్లి లూర్దు మారయ్య సిపిఎం మండల నాయకులు కోట లింగయ్య అల్లి ప్రభాకర్ వంగూరి వెంకన్న బందా బాల మట్టి జయప్రకాష్ కోదాటి లూవీస్ చింతపల్లి రాధిక మొదలగు వారు పాల్గొన్నారు.