25-07-2024 12:10:37 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దాశరథి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో దాశరథి సినీ గేయ నీరాజనం పేరుతో సంగీత విభావరి నిర్వహించారు. డాక్టర్ వివి రామరావు బృందం సంగీత సినీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యేక అతిథిగా దాశరథి ఇందిరా, గౌరీశంకర్, ఆచార్య గౌరశంకర్ పాల్గొన్నారు.