23-10-2025 06:29:57 PM
ఘాట్ కేసర్ (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ డేటా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో డేటా ఫెస్ట్-2025ను గురువారం విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ వి. విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఉత్సవం సృజనాత్మకత, ఆవిష్కరణ, డేటా ఆధారిత అభ్యాసానికి నాంది పలికింది. ఈ ఉత్సవంలో టెక్నికల్, నాన్-టెక్నికల్ ఈవెంట్లు నిర్వహించబడ్డాయి. విద్యార్థులు తమ విశ్లేషణాత్మక ఆలోచన, బృంద సమన్వయం, సృజనాత్మకతను ప్రదర్శించారు.
వాటిలో పేపర్ ప్రెజెంటేషన్ ముఖ్య ఆకర్షణగా నిలిచింది, ఇందులో విద్యార్థులు తమ పరిశోధన ఆలోచనలు, ఆవిష్కరణాత్మక పరిష్కారాలను డేటా సైన్స్ రంగంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమం డాక్టర్ ఎం. శ్రీదేవి, హెడ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డేటా సైన్స్ వారి పర్యవేక్షణలో నిర్వహించబడింది. మిసెస్ టి. సుప్రజా, మిస్టర్ డి. సైదులు ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్లుగా కె. శ్రీజ, ఎస్. వరుణ్ స్టూడెంట్ కో-ఆర్డినేటర్లుగా బాధ్యతలు నిర్వహించారు.