11-10-2025 07:40:00 PM
ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్ కుమార్..
డీసీసీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నికపై 'క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని ఏఐసీసీ ప్రతినిధి, డీసీసీ ఎన్నిక ఇంచార్జ్ డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయ ఆవరణలో ముఖ్య నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్ష ఎన్నిక నిర్వహణపై వివరించారు. 19వ తేదీ వరకు ఎన్నిక నిర్వాహన ఉంటుందని తెలిపారు. అధ్యక్ష ఎంపిక కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయ సేకరణతో పాటు సాధారణ ప్రజల, మేధావుల అభిప్రాయాలను సేకరించడం జరుగుతుందని వివరించారు.
ఎన్నిక నిర్వహణపై సేకరించిన అభిప్రాయాలను, అభ్యర్థుల వివరాలను అధిష్టానానికి నివేదిక అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో ఆయనతో పాటు పిసిసి పరిశీలకులు శ్రీనివాస్, అనిల్ కుమార్, జ్యోతి, పిసిసి ఉపాధ్యక్షురాలు సుగుణ, ఎమ్మెల్సీ దండే విట్టల్, డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్ ఉన్నారు.