calender_icon.png 12 October, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెవికెలో ప్రధానమంత్రి ధన ధాన్య యోజన ప్రత్యక్ష ప్రసారం

11-10-2025 07:42:07 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం ప్రధానమంత్రి ధన ధాన్య యోజన కార్యక్రమంపై ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసూన రైతులకు అవగాహన కల్పించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులకు ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసూన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కేంద్రం రూ 42 వేల కోట్లతో లాభదాయక వ్యవసాయ కార్యక్రమాలకు రూపకల్పన చేసిందని చెప్పారు.

పప్పు ధాన్యాల ప్రత్యేకత పై అవగాహన పెంపొందించారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సాగు రంగంలో అభివృద్ధి సాధించాలన్నారు. ఎఫ్ పి సి డైరెక్టర్లు పుష్కూరి శ్రీనివాసరావు, తిరుపతి లు మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ పంటలు పండించాలని, సహజ వ్యవసాయం వైపు ముగ్గు చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రియాసుగంది, డాక్టర్ మహేష్, డాక్టర్ స్రవంతి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ సాద్వి, ఎఫ్ బి సి సలహాదారు  గోనె శ్యాంసుందర్రావు, కొమురం భీం సేంద్రియ ఉత్పత్తిదారుల పరస్పర సొసైటీ డైరెక్టర్ బాలాజీ తో పాటు పలువు రైతులు పాల్గొన్నారు.