02-12-2025 01:27:45 AM
బెజ్జూర్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల పరిధిలో పెద్ద పులి సంచరిస్తుందనే విషయాన్ని అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. ఇటీవల కృష్ణపల్లి గ్రామానికి సమీప అటవీ ప్రాంతంలో పులి అడుగుల జాడలు, చలనం స్పష్టంగా కనిపించడంతో అధికారులు వెంటనే గ్రామస్థులకు హెచ్చరికలు జారీ చేశారు.