calender_icon.png 27 August, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాచుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు తనిఖీ

27-08-2025 02:41:40 AM

స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్

కుత్బుల్లాపూర్, ఆగష్టు 26(విజయ క్రాంతి): విజయక్రాంతి తెలుగు దిన పత్రికలో ’మైరాన్ మాయ’ అనే శీర్షికతో మంగళవారం వెలువడిన కథనానికి జిల్లా అదన పు కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్పందించారు. బాచుపల్లి తహసీల్దార్ కార్యాలయం లో మంగళ వారం తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ రికార్డులను, పరిపాలన పరమైన రిజిష్టర్లను పరిశీలించారు. బాచుపల్లి 83 సర్వే నెంబర్ కు సంబంధించి రెవెన్యూ ఫైల్ ను తహసీల్దార్, ఆర్ ఐ లను అడిగి తెప్పించుకొని పరిశీలించారు.

ఈ సర్వే నెంబర్ లో జరిగిన లావా దేవీల వివరాలు, నిషేధిత జాబితా వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బాచుపల్లి తహసీల్దార్ కార్యాలయం లో జరుగుతున్న పలు సర్టిఫికెట్స్ జారీ ప్రక్రియను సిబ్బం దిని అడిగారు. ఈ కార్యక్రమం లో మల్కాజ్గిరి ఆర్డిఓ శ్యామ్ప్ర సాద్, తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్, ఆర్‌ఐలు రేణుక, భానుచందర్, సర్వేయర్ సింధు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.