calender_icon.png 27 August, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు ధర్నా చేస్తుంటే సీఎం ఎక్కడ?

27-08-2025 02:37:46 AM

- యూరియా కోసం అన్నదాతలు ఇబ్బందులు పడుతుంటే ఢిల్లీ, బీహార్ పర్యటనలో సీఎం, మంత్రులా?

- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాష్ర్టం లో రైతులు యూరి యా కోసం తీవ్ర ఇ బ్బందులు పడు తూ.. రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే ముఖ్యమం త్రి, మం త్రులు ఎక్కడున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రై తుల ఇబ్బందులు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ పర్యటనలో, బీహార్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవ్వడంపై మంగళవారం ఎక్స్ వేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

రైతుల కష్టాలపై దృష్టి పెట్టకుండా, రాష్ర్ట సమస్యలను గాలికొదిలేసి జాతీయ రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రశ్నించారు. ‘రైతుబిడ్డలు ఇక్కడ, రా ష్ర్ట సీఎం, మంత్రులు ఎక్కడ?’ అని నిలదీశారు. ‘సమస్యలు ఇక్కడ ఉంటే, సీఎం, మం త్రులు ఢిల్లీ, బీహార్‌లోనా!’ అని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు పడుతు న్న పా ట్లు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూ పారు. ‘రైతులు యూరియా కోసం తండ్లాడుతుంటే, మీరు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి ఎగిరిపోతారా!’ అని ధ్వజమెత్తారు.

‘జాతీయ పార్టీ లకు ఓట్లు, రాష్ర్ట ప్రజలకు పాట్లు’ అంటూ మండిపడ్డారు. యూరియా సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని ఆరోపించారు. ‘యూరియా ఏదయా అంటే కాంగ్రెస్ ఎంపీలు తేలేరు, బీజేపీ ఎంపీలు అడగనే అడగరు’ అని దెప్పిపొడిచారు. రాష్ర్ట ప్రభుత్వ వైఖరి, జాతీయ పార్టీల నిర్లక్ష్యాన్ని తెలంగాణ ప్రజ లు గమనిస్తున్నారని, ప్రశ్నిస్తున్నారని హెచ్చరించారు. రైతుల సమస్యల ను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.