27-08-2025 02:36:53 AM
కుదవపెట్టిన కిలోల కొద్దీ బంగారంతో జ్యువెలరీ వ్యాపారి పరారీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి): ఏళ్ల తరబడి పెంచుకున్న న మ్మకాన్ని నట్టేట ముంచుతూ ఓ నగల వ్యా పారి.. తన వద్ద కుదవ పెట్టిన బంగారంతో ఉడాయించారు. సుమారు 200 కుటుంబాల కళ్లల్లో కన్నీళ్లు మిగిల్చాడు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో జరిగిన ఈ ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిలింనగర్ గౌతమ్ నగర్ బస్తీలో రాజస్థాన్‌కు చెందిన మాణిక్ చౌదరి.. మాణిక్ జ్యూ వెలరీస్ పేరుతో చాలా సంవత్సరాలుగా నగ ల దుకాణాన్ని నడుపుతున్నాడు. స్థానికుల తో సత్సంబంధాలు నెరపుతూ, వారి నమ్మకాన్ని చూరగొన్నాడు.
దీంతో, చుట్టుపక్కల వారు తమ ఆర్థిక అవసరాలకు అతని దుకాణంలోనే బంగారం తాకట్టు పెట్టేవారు. అత్య వసరాల రీత్యా కొందరు తులాల కొద్దీ బం గారాన్ని ఇచ్చి అతి తక్కువ మొత్తంలో రు ణం తీసుకున్నారు. ఓ మహిళ ఆరు తులాల బంగారం కుదవ పెట్టి కేవలం లక్ష రూపాయ లు మాత్రమే తీసుకుంది. ఇలా చాలామంది తక్కువ మొత్తంలోనే రుణం తీసుకున్నారు. అయితే, గత వారం రోజులుగా దుకాణం మూసి ఉండటం, మాణిక్ చౌదరి ఫోన్ స్వి చ్ఛాఫ్ రావడంతో స్థానికులకు అనుమానం మొదలైంది.
ఇంటి వద్దకు వెళ్లి చూడగా అక్కడ కూడా ఎవరూ లేకపోవడంతో మోసపోయామని గ్రహించారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు డబ్బులు చెల్లించిన వారికి సైతం, బంగారం బ్యాంకు లాకర్‌లో ఉంది తెచ్చిస్తాను అని నమ్మబలికిన మాణిక్.. ఆ డబ్బుతో సహా ఉడాయిం చాడు. విషయం తెలుసుకున్న బాధితులు సుమారు 200 మంది వరకు లబోదిబోమంటూ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న మాణిక్ చౌదరి కోసం గాలిస్తున్నారు.