calender_icon.png 27 August, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాటలు విన్నందుకు ఉరిశిక్ష

01-07-2024 01:15:17 AM

  • కిమ్ జోంగ్ ఉన్ మరో అరాచకం

దక్షిణ కొరియా పాటలు విన్నాడని వ్యక్తికి ఉరిశిక్ష 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

సియోల్, జూన్ 30 : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతగా వ్యవహరిస్తూ ఆ దేశంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తన శత్రు దేశమైన దక్షిణ కొరియాకు చెందిన పాటలు విన్నాడని, ఆ దేశ సినిమాలు చూశాడనే ఆరోపణలతో ఓ వ్యక్తిని బహిరంగంగా ఉరి తీసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల దక్షిణ కొరియా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం బయటపడింది. త్తర కొరియా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని వెల్లడించింది.

ఈ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం. 2022లో దక్షిణ హ్వాంగ్‌హే ప్రావిన్స్‌కు చెందిన 22 ఏళ్ల వ్యక్తి 70 దక్షిణ కొరియా పాటలు విన్నాడని, అలాగే ఆ దేశానికి చెందిన 3 సినిమాలు చూశాడని, వాటిని ఇతరులకు షేర్ చేశాడని, అతన్ని బహిరంగంగా ఉత్తర కొరియా ఉరితీసింది. ఉత్తర కొరియా తన దేశ పౌరులు వినియోగించే సమాచారంపై ఎల్లప్పుడూ నిఘా కలిగి ఉంటుంది. శత్రు దేశాలకు చెందిన సినిమాలు, పాటలు వింటే, పాశ్చాత్య సంస్కృతి పట్ల కఠినమైన నిబంధనలు అమలు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే చాలా కఠినమైన శిక్ష విధిస్తుంది.