19-05-2025 12:03:01 AM
ప్రాణం తీసిన వాకింగ్
బైక్ రేస్‌లతో యువకులకు ముప్పు
టర్నింగ్ పాయింట్ల వద్ద లేని స్వీడ్ బ్రేకర్లు
గోపాలపేట మే 18: రోడ్డుపై యువకులు బైకు లు నడపాలంటే వారి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిం దే... పలు అవసరాలకు యువకులు బైకులు పై వెళ్లాలంటే ఈ రహదారి లో ని తాడిపర్తి గుళ్లోని మిట్ట వద్ద రోడ్డు డేంజర్ పాయింట్ గా మారింది. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తి గ్రామ సమీపంలో ని త్యం ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఈ రహదారి వైపు ప్రయాణం చేయాలంటే ఈ డేంజర్ పాయింట్ రాగానే బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తుంటారు. అంటే ఈ డేంజర్ పాయింట్ ఎంత ప్రమాదమో అర్థమవుతుంది. ప్రభుత్వం ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలన్న సంకల్పంతో ప్రతి రోడ్డును అద్దంగా మార్చారు. వనపర్తి నుండి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రధాన రహదారి బిజినపల్లి వరకు ఎక్కడ కూడా గోతులు లేకుండా రోడ్డు అద్దంలా పరచుకుని ఉంది.
దీంతో యువకులు పోటీలతో బైక్ రేస్లు చేస్తుంటారు దీంతో వేగం ఎక్కువై ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. గోపాలపేట మండలంలోని పలు గ్రామాల నుంచి వనపర్తికి వెళ్లాలంటే ఈ డేంజర్ పాయింటును దాటి వెళ్లాల్సిందే. భయానికి గురైన కొంతమంది యువకులు గ్రామస్తులు ఈ దారి గుండా వెళ్లడానికి నిరాకరి స్తూ చెన్నూర్ బుద్ధారం గ్రామాల వైపు నుం డి వనపర్తికి చేరుకుంటున్నారు.
ఇటీవలే పది రోజుల క్రితం ఈ డేంజర్ పాయింట్ వదే. మలుపు వద్ద వేగంగా ద్విచక్ర వాహనంతో బస్సుకు ఢీకొని ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అంతకుముందు ఆటోకు ఢీకొని మరో వ్యక్తి ప్రాణాలను పోగొట్టుకు న్న సంఘటనలు ఉన్నాయి. కాబట్టి రవాణా శాఖ అధికారులు ప్రధాన రహదారిపై బై కుల వేగం తగ్గించడానికి స్పీడ్ బ్రేకర్లను ఏ ర్పాటు చేశారు. బుద్ధారం నుండి వనపర్తి వరకు సుమారుగా ప్రధాన రోడ్డుపై పది నుండి 15 వరకు మలుపులు ఉన్నాయి.
రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే మలుపుల వద్ద సూచికల బోర్డు ఏర్పాటు చేయాలి
ఈ మలుపుల వద్ద సూచిక బోర్డులతో పాటు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు గ్రామస్తులు కోరుతున్నారు ఈ డేంజర్ పాయింట్ వద్ద ప్రమాదాలు తగ్గాలంటే మలుపుకు 100 మీటర్లు కుడివైపు ఎడమవైపు స్పీడ్ బ్రేకర్లను ఏర్పా టు చేస్తే వేగంగా వచ్చే వాహనాలు వేగం తగ్గించవచ్చని అప్పుడే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రజలు వాపోతున్నారు.
ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించాలి..
యువకులు రోడ్డుపై బైకులు నడిపే క్రమంలో వారు వేగం తగ్గించుకునేలా పోలీసులు వారికి అవగాహన కల్పించాలి. ఉద యం 5 నుంచి 6 గంటలకు ప్రజలు రోడ్డుపై వాకింగ్లు చేస్తుంటారు అలాంటి వారికి రోడ్డుపై వాకింగ్ చేయకుండా అనుకూలమైన మైదానంలో వాకింగ్ చేయాలని అవగాహన కల్పించాలి.
వాకింగ్ తీసిన ప్రాణం..
యువకులు ప్రతిరోజు వాకింగ్ లకు వెళ్తున్నామని షూట్ బూటు వేసుకొని రోడ్డు ఎ క్కుతారు అదే వాకింగ్ మైదానంలో చేసుకోకుండా నిత్యం రోడ్లపై వాకింగ్లు చేస్తున్నా రు ఇటీవలే వనపర్తి రోడ్డుపై నర్సింగాయపల్లి గ్రామ సమీపంలో వాకింగ్లు చేస్తున్న ఇద్దరు మహిళలు ప్రమాదానికి గురై ఓ మహిళ ప్రాణాలను పోగొట్టుకుంది. రోడ్లపై బైకులు వేగంగా వచ్చి వాకింగ్ చేస్తున్న యువకులను మహిళలను ఢీకొన్న సంఘటనలు చాలా ఉన్నాయి.
ప్రజలు వారి ఆరోగ్యం కాపాడుకునేందుకు రోజు తెల్లవారుజామునే వా కింగ్ చేస్తే బాగుంటుందని రోడ్డుపైకి వస్తుంటారు అలా రోడ్డుపై వాకింగ్ చేయడం పట్ల అడుగుభాగాన రోడ్డు గట్టిగా ఉండడంతో మోకాళ్ల నొప్పులు వస్తుంటాయి రోడ్డుపై చేయడం పట్ల నష్టమే జరుగుతుందని కాబ ట్టి రోడ్డుపై కాకుండా అనువైన మైదానం మెత్తటి మట్టిపై వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. పోలీసులు వారికి అవగాహన కల్పించాలి.
మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లను వెయ్యాలి
బిజినపల్లి నుండి వనపర్తి వ రకు రోడ్డు చాలా బాగుంది కాబట్టి యువకులు బైకులను వేగంగా న డుపుతుంటారు. వేగం పెరగడం పట్ల ప్రమాదాలు పోగొట్టుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి ఆర్టీసీ స్పందించి మలుపులు ఎక్కడైతే ఉంటే అక్కడ ముందు బాగా నా వెనక భాగాన వీడు బ్రేకర్లను ఏర్పా టు చేయాలి. దీని పట్ల ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
పరమేశ్వర్ గోపాలపేట
డేంజర్ పాయింట్ వద్ద బోర్డు ఏర్పాటు చేయాలి
గత ప్రభుత్వం లో రోడ్లు అన్ని చాలా బాగు చేశా రు. యువకుల్లో ఉత్సా హం పెరిగి రైతులు వేగంగా నడుపుతున్నారు. వారికి కనపడేలా మలుపుల వద్ద ఈ డేంజర్ పాయింట్లు వద్ద హెచ్చరిక బోర్డులు పెద్దగా ఏర్పాటు చేస్తే వారు వేగాన్ని తగ్గించుకొని బైకులు నడుపుతారు.
బాలరాజు గోపాలపేట్