calender_icon.png 19 May, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపుతప్పితే అంతే సంగతి!

19-05-2025 12:24:17 AM

  1. అత్యంత ప్రమాదకరంగా హిమాయత్ సాగర్ మలుపు  

మోకాలు ఎత్తులో కూడా లేని  గ్రిల్స్ 

చాలా భాగం ఫెన్సింగ్ లేని దుస్థితి  

మూలమలుపులో భయం భయంగా ప్రయాణం  

ఏమాత్రం దృష్టి సారించని అధికారులు 

ప్రమాదాలు జరగకముందే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి  

రాజేంద్రనగర్, మే 18: అధికారుల నిర్లక్ష్యం వాహనదారుల పాలిట ప్రమాదంగా మారుతుంది. ఏమాత్రం ఏమరుపా టుగా ఉన్నా వాహనాలు చెరువులోకి దూసుకెళ్తాయి. అ ధికారుల పట్టింపు లేని తనం ప్రజలకు ప్రాణ సంకటంగా మారిందని స్థానికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్, అదే వి ధంగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే హిమాయత్ సాగర్ చెరువు వద్ద చౌ డమ్మ చెరువు సమీపంలో ఔటర్ సర్వీసు రోడ్డు అత్యంత ప్రమాద భరితంగా మారిందని స్థానికులు వాహనదారులు పేర్కొం టున్నారు. 

 పట్టు తప్పితే ప్రాణాలు హరీ..

ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రహదారి మీదుగా హిమాయత్ సాగర్ చెరువు అంచు నుంచి ప్రతిరోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇటు బండ్లగూడ కార్పొరేషన్, అదేవిధం గా పోలీసు అకాడమీ, అటు శంషాబాద్ పట్టణం నుంచి వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. రోజురోజుకు వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది.

అయితే సౌడమ్మ ఆలయం సమీపంలో ఔటర్ సర్వీసు రహదారి మూలమలుపు ప్రమాద భరితంగా మారింది. అదే విధంగా ఇక్కడ రోడ్డు ఇరుకుగా మారింది. దీనికి తోడు చాలా దూరం మోకాలు అంత ఎత్తు కూడా గ్రిల్స్ లేవు. కొంత దూరం ఫెన్సింగ్ కూడా లేకపోవడంతో వాహనదారులు భయంభయంగా ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాహనాలు ఏమాత్రం అదుపుతప్పినా, వాహనదారులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం పొంచి ఉంది. సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వెంటనే గ్రిల్స్ తో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొంతమేర కొండ ప్రాం తాన్ని తొలిచి రహదారిని విస్తరించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం మెండుగా ఉంది. 

అధికారులు సత్వరమే స్పం దించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎం తైనా ఉందని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు కూడా తగిన చొరవ తీసుకోవాలి.