05-08-2025 12:00:00 AM
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. పార్టీల పేరు మాత్ర మే వేరు. కానీ, వారి లక్ష్యం, కార్యాచరణ మాత్రం ప్రభుత్వ రంగసంస్థలను తెగనమ్మడం, కార్పొరేట్ సెక్టార్‌కు ఊడిగం చేసి పెట్టడం, వారికి లాభాలు సమకూర్చి తరించడమే కనిపిస్తున్నది. ప్రస్తుతం సింగరేణి గనుల ప్రైవేటీకరణ అంశాన్ని చూస్తే, కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోకడలు కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కార్మి కులు ప్రస్తుతం తమ ఉద్యోగ భద్రత గురిం చి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వాలు గతంలో కార్మికుల సంక్షేమం కోసం, వారి భద్రత కోసం ఆలోచించేవి. పర్యావరణ పరిరక్షణపైనా దృష్టి సారించేవి. దీనిలో భాగంగానే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు చర్య లు తీసుకునేవి.
1990 తర్వాత ప్రభుత్వ విధానాల్లో మౌలికమైన మార్పులు వచ్చాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చాయి. నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్ అమలు చేసిన ఆర్థిక నియమ, నిబంధనలను, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా అనుసరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి సీఎం చం ద్రబాబు అవేరకమైన ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేశారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థలకు దేశంలో బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు.
ఒక దశలో చంద్రబాబు ఆయా సంస్థల అనధికార సీఈవోగా పిలువబడ్డాడు. ఈ క్రమంలోనే సింగరేణి పరిధిలో బొగ్గు ఉత్పత్తిపై ప్రైవేట్ సంస్థల చొరబాటు ప్రారంభమైంది. నాటి ప్రభుత్వాలు లీజ్ ఒప్పంద విధానాలను సులభతరం చేయడం కారణంగా సింగరేణిలో ప్రైవేట్ సంస్థలు చొచ్చుకుని వచ్చా యి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల నుంచి దూకుడుగా అన్ని సెక్టార్లలోనూ ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తున్నది. దీనిలో భాగంగానే 2021లో సింగరేణి పరిధిలో ఒక దుర్మార్గ చట్టాన్ని తీసుకొచ్చింది. బొగ్గు గనులను వేలంలో దక్కించుకున్న వారికి, ఎలాంటి కండిషన్లు ఉండవనే వెసులుబాటు కల్పించడం ఈ చట్టం ఉద్దేశం.
బొగ్గు బ్లాకుల వేలం ఆందోళనకం..
కార్మికుల భద్రత, సంక్షేమం, పర్యావరణ సంరక్షణ మొదలైన సమస్యసు ఏమై నప్పటికీ.. ఇవేవీ ప్రభుత్వాలకు ముఖ్యం కాదు. ప్రభుత్వాలకు లాభాలను దండుకోవడమే లక్ష్యం. దీనిలో భాగంగానే సింగ రేణిపైనా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయా లు, సంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ. సంస్థ పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన సింగరేణి పరిధిలోని గనులకు వేలం నిర్వహించటం, తద్వారా వాటిని ప్రైవేటీకరించడం కార్మికులను ఆం దోళనకు గురిచేస్తున్నది.
వాస్తవానికి ప్రభుత్వమే పూనుకొని సింగరేణి సంస్థ మాత్ర మే బొగ్గు ఉత్పత్తి జరిపిలా చూస్తే కార్మికులతో, ఆ బొగ్గును కొనుగోలు చేస్తే విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కూడా కారు చౌకగా బొగ్గు లభిస్తుంది. గనులను ప్రైవేటీకరిస్తే, సదరు సంస్థలు ఎక్కువ ధరకు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బొగ్గును విక్రయిస్తాయి. దీంతో సదరు సంస్థలు కూడా ఆర్థిక ఇ బ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రమంగా విద్యుత్ చార్జీలు పెరుగుతాయి. ఈ పరిణామాలు ప్రజల మీద, సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. ప్రభుత్వ ఖజానాకూ గండిపడే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వాలు కార్మికులు, సంస్థ ప్రయోజనాలను పక్కనపెట్టి, కేంద్రం బొగ్గు బ్లాకు లను వేలం వేయడం దుర్మార్గమైన చర్య. బడా కార్పొరేట్ శక్తుల లాభాల కోసం లక్షలాది మంది కార్మికులు పనిచేసే సంస్థను బలిపెట్టడం సరికాదు. మోదీ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ప్రైవేటు సంస్థలకు విపరీతమైన రాయితీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బొగ్గు దిగుమతులపై సుంకం కూడా రద్దు చేసింది.
సమాజంపైనా దుష్ర్పభావం..
పాలకుల విధానాల వల్ల కోల్ ఇండి యా, సింగరేణికి సహజసిద్ధంగా సంక్రమించిన హక్కులు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. నాడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కోల్ ఇండియా పరిదిలోని 10 శాతం వాటాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఆ శాతం 29కు పెరిగింది. ఈ చర్యలు కచ్చితంగా సింగరేణి హక్కులను నిర్వీర్యం చేయడమే. ప్రైవేటీకరణ విధానాలపై 2003లోనే కార్మికులు 15 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ తర్వాత కూడా అనేక పోరాటాలు జరిగాయి. తెలంగాణలోని గోదావరి పరీవాహ ప్రాంతంలో సింగరేణి సొంత ఖర్చులతో అనేక సర్వేలు చేపట్టి బొగ్గు బ్లాక్‌లను గుర్తించింది. ఆపై బొగ్గు ఉత్పత్తి కూడా చేపట్టింది.
దీనిలో భాగంగానే శ్రావణ ఫల్లిలోనూ బొగ్గు తవ్వకాలు చేపట్టాల్సింది. కాని, బీజేపీ ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. గనిలో బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు ఏ సంస్థ అయినా, వేలంలో గనిని దక్కించుకోవాలనే నిబంధన పెట్టింది. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఇంచుమించు ఇలాంటి నిర్ణయాల నే అమలు చేసింది. సింగరేణిలో ప్రైవేటీకరణ ఎంత ఎక్కువగా జరిగితే, కార్మికులు అంత నష్టపోయే ప్రమాదం ఉంది. అం దుకే గనుల వేలాన్ని రద్దు చేయాలని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులన్నీ సింగరేణి సంస్థ పరిధిలోనే ఉండేలా చూ డాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించద్దని కోరుతున్నారు. గనులను ప్రైవేటీకరించమని ఆశాఖ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తరచూగా చెప్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం వేలం పాటలు నిర్వహిస్తూనే ఉం ది. ఇది కార్మికులను మోసగించే విధానం కాదా! ఇటీవల కొన్ని బొగ్గు బ్లాకుల కేటాయింపునకు నిర్వహించిన వేలంలో కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్రం తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పాల్గొనటం సరైంది కాదు. ఆ రెండు పార్టీలు ఇప్పటికైనా సింగరేణి ప్రైవేటీకరణపై వారి విధానాలెంటే స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ గనులు తెలంగాణలో నే ఉన్నాయి కాబట్టి, రాష్ట్రప్రభుత్వం ఎక్కువగా చొరవ తీసుకోవాలి. సింగరేణి పరిర క్షణకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అవసరమైతే అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభు త్వం వద్దకు తీసుకుపోయి సింగరేణిని రక్షించుకునే కార్యాచరణ అమలు చేయా లి. దొడ్డి దారిన గనులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే కుట్రలను బద్దలు కొట్టాలి.
వ్యాసకర్త సెల్: 98493 28496