09-12-2025 01:37:05 AM
పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు రాచాల యుగంధర్‌గౌడ్
గోపాలపేట డిసెంబర్8: మన గ్రామం అభివృద్ధి చెందాలంటే విద్యావంతులకు ఓటేసి గెలిపించుకోవాలని పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షులు రాచాల యుగేందర్ గౌడ్ అన్నారు. సోమవారం గోపాలపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సువర్ణ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారంలో రాచాల యుగంధర్ గౌడ్ మద్దతు పలికారు. తాను కూడా ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. .
మండల కేంద్రంలో ఈదమ్మ గడ్డ ఎర్రగడ్డ 14 కాలనీలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్గా గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఓటును వేయాలని ప్రజలను అర్థించారు. సర్పంచ్ అభ్యర్థి సువర్ణ గుర్తు ఉంగరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి వ్యక్తులను గెలిపించుకునేలా ప్రజలంతా కంకణం కట్టుకోవాలని చెప్పారు. ఈనెల 11న సువర్ణ కు మంచి మెజారిటీ ఇచ్చి ఘన విజయం సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి భర్త న్యాయవాది ఆంజనేయులు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.