calender_icon.png 9 December, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో మ్యానిఫెస్టో!

09-12-2025 02:22:22 AM

మహబూబాబాద్ జిల్లా భూక్యరాం తండా సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రయత్నం

మహబూబాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): సాధారణంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనే రాజకీయ పార్టీలు అభివృద్ధి కార్యక్రమాల ను మేనిఫెస్టో రూపంలో విడుదల చేయడం ఇప్పటివరకు చూశాం. అయి తే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం భూక్యరాం తండా కు చెందిన వాంకుడోత్ కవిత, వెంకన్న దంపతులు తమను సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలిపిస్తే గ్రామాభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు సం బంధించి 11 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు.

సర్పంచు పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా కవిత పోటీ చేస్తుండగా, ఆమె భర్త వెం కన్న వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. తమకు ఓటేసి గెలిపిస్తే ఐదేళ్ల పాటు మీ వెంటే ఉంటూ నిష్పక్షపాతం గా వ్యవహరిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని, సర్పంచు వేతనం కిం ద వచ్చే నెలకు 6,500 రూపాయలను గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే వారి కి అందజేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు.