calender_icon.png 29 January, 2026 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

29-01-2026 12:04:55 AM

కలెక్టర్ పింకేష్ కుమార్ 

జనగామ, జనవరి 2౮ (విజయక్రాంతి):  మున్సిపల్ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ ప్రతిని ధులు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ కోరారు. ఎన్నికల నిర్వ హణకు  నామినేషన్లు స్వీకరణ ప్రారంభం అయినందున, రాజకీయ పార్టీల అభ్యర్దులు నామినేషన్లు సమర్పణలో తీసుకోవల్సిన జాగ్రత్తల, జతపర్చాల్సిన దృవీకరణ పత్రాల పై పలు రాజకీయ ప్రతినిధులతో బుదవా రం కలెక్టరేట్ మీని సమావేశ మందిరంలో  అదనపు కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం  నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్దులు ఖచ్చితమైన దృవపత్రాల తో నామినేషన్ కేంద్రాలకు చే రుకోవాలని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్దులకు ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే సంబంధిత రిటర్నింగ్ అధికారులను సంప్రదించి తమ అనుమానా లను నివ్తృత్తి చేసుకోవాలని రాజకీయ ప్రతినిధులకు తెలిపారు.

అలాగే పోలింగ్ సంద ర్బంలో మహిళలకు, పురుషులకు వేరు వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేసే అభ్యర్దులు ఓటరు జాబితాలో ముందస్తుగా తమ పేర్లను పరిశీలించుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల నిర్వహణ పూర్తి వివరాలు అభ్యర్దుల నుంచి మినేషన్ల స్వీకరణ ఈ నెల 28 తేది నుండి 30వ తేది సా యంత్రం 5.00 గంటల వరకు మున్సిపల్ నిబంధనల ప్రకారం ఆయా వార్డులలో ఓట ర్ల జాబితాలను ప్రదర్శించుట స్వీకరించిన నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) తేదిః 31.01.2026 న జరుగుతుంది. ఏమైనా నామినేషన్ల తిరస్కరణ కు గురైతే అప్పిలు చేసుకొనేందుకు చివరి తేదిః 01.02. 2026న సాయంత్రం 5.00 గంటల లోపు దాఖలై అప్పీళ్ళ పరిష్కరణకు చివరి తేదిః 02.02.2026 న సాయంత్రం  5.00 గంటల లోపు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదిః 03.02.2026 న మధ్యాహ్నం 3.00 గంటల లోపు.

పోటీ చేసే అభ్యర్దుల జాబీతా ప్రచురణ చేయు తేదిః 03.02. 2026న మధ్యాహ్నం 3.00 గంటల తరువాత . పోలింగ్ తేదిః 11.02.2026న ఉద యం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు. రీ-పోలింగ్ ఏమైనా ఉన్నట్లయితే తేదిః 12.02.2026న నిర్వహించబడును.13.02.2026న ఉదయం 8.00 గంటల నుండి ఓట్ల లెక్కింపు నిర్వహించబడునని అదనపు కలెక్టర్ రాజకీయ ప్రతినిధు లకు వివరించారు.

ఈ సమావేశంలో ఎన్నికల పర్యవేక్షకులు శ్రీధర్, వివిధ రాజకీయ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.