26-06-2025 12:00:00 AM
జీతాలు ఆపడానికి కారణం ఇదేనా..!
మంచిర్యాల, జూన్ 25 (విజయక్రాంతి) : మంచిర్యాల పౌర సరఫరాల సంస్థ పరిధిలో ఉన్న ఎంఎల్‌ఎస్ (మండల లెవల్ స్టాక్) పాయింట్లలో డాటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)లుగా పని చేస్తున్న సిబ్బంది తీరు వేరే లెవల్‌గా ఉంది.
జిల్లాలోని మంచిర్యాల, లక్షెట్టిపేట, మందమర్రి, బెల్లంపల్లి, తాండూ రు, కోటపల్లి మండలాల్లోని ఎంఎల్‌ఎస్ పాయింట్లలో విధులు నిర్వహిస్తున్న గోదాం ఇంఛార్జీలతో పాటు డాటా ఎంట్రీ ఆపరేట ర్లను ఒక ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి మరో ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు జిల్లా మేనే జర్ శ్రీకళ బదిలీ చేశారు.
ఉత్తర్వులు జారీ చేసి నెలలు గడుస్తున్నా అక్కడ నుంచి కదల కుండా ఉంటున్నారు. వారు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బదిలీ ఆదేశాలు ఇలా...
మంచిర్యాల ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో డీఈఓగా విధులు నిర్వహిస్తున్న డీ నాగరా జును జిల్లా సివిల్ సప్లయ్ కార్యాలయానికి, లక్షెట్టిపేట ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో విధు లు నిర్వహిస్తున్న కే సంతోశ్‌ను మంచిర్యాల ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు బదిలీ చేశారు.
అలాగే తాండూరు ఎంఎల్‌ఎస్ పాయింట్ లో పని చేస్తున్న ఏ శ్రీలతను బెల్లంపల్లి ఎం ఎల్‌ఎస్ పాయింట్‌కు, చంద్రారెడ్డిని బెల్లం పల్లి నుంచి లక్షెట్టిపేట ఎంఎల్‌ఎస్ పాయిం ట్‌కు, జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాల యంలో పని చేస్తున్న జీ భూపతిని కోటపల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు,
రాజశేఖర్‌ను కోటపల్లి నుంచి తాండూరు ఎంఎల్‌ఎస్ పాయింట్‌లకు బదిలీ చేస్తూ సివిల్ సప్లయ్ డీఎం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఒకరిద్దరు వారికి కేటాయించిన గిడ్డంగి వద్ద విధులు నిర్వహిస్తుండగా మిగితా వారంతా యథాస్థానంలో ఉన్నారు.
డీఎం ఆదేశాలు బేఖాతరు...
పౌర సరఫరాల సంస్థలో జిల్లా మేనేజర్ (డీఎం) ఆదేశాలను క్రింది స్థాయి సిబ్బంది పూర్తిగా పట్టించుకోవడం లేదనేది స్పష్టమ వుతుంది. ఎంఎల్‌ఎస్ పాయింట్ లలో ఏండ్ల తరబడి ఒకే చోట తిష్ఠ వేసిన డీఈఓ (డాటా ఎంట్రీ ఆపరేటర్)లను మార్చి 19వ తేదీన ట్రాన్స్ ఫర్ చేస్తూ సివిల్ సప్లయ్ డీఎం శ్రీకళ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదేశా లిచ్చి మూడు నెలలవుతున్నా కొందరు డీఈవోలు దానిని ఏమాత్రం పట్టించుకో కుండా అక్కడే యథావిధిగా విధులు నిర్వహి స్తున్నారు. జిల్లా అధికారి ఆదేశాలకు విలు వలేకుండాపోయిందని పలువురు ఆ శాఖలో పని చేస్తున్న వారే గుసగుసలా డుతున్నారు.
జీతాలు ఆపడానికి కారణం ఇదేనా..!
జిల్లాలోని ఎంఎల్‌ఎస్ పాయింట్లలో పని చేస్తున్న డీఈఓల జీతాలు ప్రతి నెల ఒకటి లేదా రెండో తేదీలలో వారి వారి అకౌం ట్లలో జమచేస్తుంటారు. గడిచిన రెండు నెలలుగా వారికి జీతాలను సంబంధిత శాఖ అధికారులు వేయడం లేదు. ఉన్నతాధికారి ఆదేశాలు బేఖాతరు చేశారనే నెపంతోనే జీతాలు నిలిపివేశారా..! మరేదైనా కారణం ఉందా అనేది తెలియడం లేదు.
కొందరేమో మార్చి నెలలో బదిలీలు చేస్తూ ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదనే సాకుతోనే రెండు నెలలుగా జీతాలు ఆపినట్లు అను మానం వ్యక్తం చేస్తున్నారు. ఏదీఏమైనా నెల నెల జీతం వస్తేనే ఇల్లు గడుస్తుందని, రెండు నెలలుగా అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వారి బాధను వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయమై సివిల్ సప్లయ్ కార్పొ రేషన్ జిల్లా మేనేజర్ శ్రీకళను వివరణ కోరేందుకు పలు మార్లు ప్రయత్నించగా మొబైల్ లిప్ట్ చేయలేదు.