17-05-2025 03:32:23 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం కొత్తగూడెం వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో క్యాంటీన్ నిర్వహణ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మంత్రి తు మ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ్ సహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యేలు సాంబశివరావు, రాందాస్ నాయక్ కలెక్టర్, ఎస్పీ జితేష్ వి పాటిల్,రోహిత్ రాజ్ పాల్గొన్నారు