calender_icon.png 28 July, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్

26-07-2025 01:06:05 AM

రూ.2 లక్షలు తీసుకుంటూ దొరికిన రవికుమార్

రాజేంద్రనగర్, జూలై 25: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డివిజన్  సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ శుక్రవారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. డీఎస్పీ శ్రీ నివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ డివిజన్‌లోని ఒక ఫుడ్ కోర్ట్ యజమానిని తరచుగా డీసీ రవికుమార్ వేధిస్తున్నట్లు చెప్పారు. నిబం ధనల ప్రకారం ఫుడ్‌కోర్టు నిర్వహించడం లేదంటూ బాధితుడిని వేధింపు లకు గురిచేశారు.

ఈ క్రమంలో రవికుమార్.. రూ.5 లక్షలు డిమాండ్ చేయ గా రూ.2 లక్షలు ఇచ్చేలా బాధితుడు డీల్ కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు.. వారి సూచనల ప్రకారం రవికుమార్‌కు కా ర్యాలయంలో రూ.2 లక్షలు ఇస్తుండగా పట్టుకున్నారు.

రూ.5 లక్షల డిమాండ్ విషయంలో మీడియా వారికి కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉందంటూ సదరు అధికారి బాధితుడితో చెప్పారని అట్టి విషయంపై కూడా ప్రస్తుతం విచారణ చేపడుతున్నామని డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి  కార్యాలయంతో పాటు  ఆయన ఇంట్లో ఏకకా లంలో సోదాలు నిర్వహించి పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకొ న్నట్లు సమాచారం.