calender_icon.png 28 July, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై పరిమితిని తొలగించాలి

26-07-2025 01:04:37 AM

కేంద్ర మంత్రిని కోరిన బీసీ ప్రతినిధి బృందం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లపై పరిమితిని తొలగించాలని కోరుతూ రాష్ట్ర బీసీల ప్రతినిధి బృందం సభ్యులు, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఏపీ అధ్యక్షుడు బోనే దుర్గా నరేష్, ఢిల్లీ ఇన్‌చార్జి కర్రి వేణుమాధవ్, జనరల్ సెక్రటరీ నంద గోపాల్, మహిళా ఉపాధ్యక్షురాలు శారద.. శుక్రవారం కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వినతిపత్రం అందజేశారు.

బీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని.. ఇందుకోసం రా జ్యాంగ సవరణ చేపట్టాలని కూడా వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంతో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితి తొలగిపోయిందన్నారు.

దీంతో రిజర్వేషన్లపై ఉన్న న్యాయపరమైన, చట్టపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు తొలగిపోయాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం కేంద్రంలో 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ..