calender_icon.png 2 July, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండ్లగూడ చెరువులో పూడికతీత చేపట్టాలి

02-07-2025 01:04:34 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

ఎల్బీనగర్, జూలై 1 : నాగోల్ డివిజన్ లో ముంపు సమస్య తీరాలంటే ముందు గా బండ్లగూడ చెరువులో పూడికతీత చేపట్టాలని, బాక్స్ డ్రైన్ నిర్మాణాలు చేపట్టాల ని అధికారులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశించారు. నాగోల్ డివిజన్ లోని అయ్యప్ప కాలనీలో వాటర్ వరక్స్, ఇరిగేషన్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు డ్రైనేజీ, రోడ్ల సమస్యలను వివరించారు.

అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో ముంపు సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. గతంలో బాక్స్ డ్రైన్స్ నిర్మా ణాలు చేపట్టి, దీనికి అనుగుణంగా బండ్లగూడ చెరువు తూములను ఏర్పాటు చేయడంతో నీటి ప్రవాహాన్ని నాలాల ద్వారా మూసీకి పంపించినట్లు తెలిపారు. కానీ, అయ్యప్పకాలనీ నైసర్గిక స్వ రూపం సాసర్ ఆకారంలో ఉండడంతో ఎడమవైపు ఉన్న ఇండ్లకు, కుడివైపు ఉన్న ఇండ్లలోకి వ రద చేరుతుందన్నారు.

నూతన డ్రైనేజీ నిర్మాణ పనుల్లో ఎత్తుపల్లాలు సరిచూసి పైప్ లైన్ పనులు చేపట్టాలని ఆదేశించారు. డ్రైన్స్ పనులు పూర్త య్యాక నూతన రోడ్ల నిర్మాణాలు చేయిస్తానని హామీ ఇచ్చారు. బండ్లగూడ చెరువులో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు రమేష్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, కనకయ్య, సతీశ్, కాలనీవాసులు నర్సింహచారి, సతీష్ తదితరులుపాల్గొన్నారు.