calender_icon.png 30 January, 2026 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ గాంధీతో శశి థరూర్ భేటీ

30-01-2026 12:00:00 AM

  1. తనపై ప్రచారానిన కొట్టిపారేసిన ఎంపీ
  2. మేమందరం ఒకే తాటిపై ఉన్నామని ‘ఎక్స్’లో పోస్టు

న్యూఢిల్లీ, జనవరి29 : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గురువారం పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. పార్టీలో విభేదాల ఊహాగానాలను తోసిపుచ్చు తూ, ఈ భేటీ ఒక సాధారణమైనదని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశానికి ముందు న్యూ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, థరూర్ తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశా రు. ‘నేను ఇప్పుడు పార్లమెంటుకు వెళ్తున్నాను. అది జరిగినప్పుడు నేను మీకు తెలియజేస్తాను.

నా సొంత పార్టీ నాయకుడిని కలవడంలో అంత అసాధారణం ఏముంది?’ అని ఆయన అన్నారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని ఖర్గే ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశం గం టకు పైగా కొనసాగింది. బుధవారం కొత్త పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో థరూర్ రాహుల్‌గాంధీ, ఖర్గే ఇద్దరి తోనూ చర్చలు జరిపారు. కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావే శానికి హాజరయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అయితే శశిథరూర్ ఈ సమావేశానికి సంబంధించిన ఒక చిత్రాన్ని తన ఎక్స్‌ఖా తాలో పోస్టు చేస్తూ.. తనకు, కాంగ్రెస్ అధినాయకత్వానికి మధ్య అంతా సవ్యంగా ఉందని పేర్కొన్నారు. ‘వివిధ అంశాలపై ఈరోజు జరిగిన ఆత్మీయ, నిర్మాణాత్మక చర్చ జరగినందు కు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. భారతదేశ ప్రజల సేవలో ముందు కు సాగుతున్నప్పుడు మేమందరం ఒకే తాటిపై ఉన్నాం’ అని ఆయన పోస్ట్ చేశారు.