09-12-2025 02:34:15 AM
ప్రహరీని కూల్చివేసిన హైడ్రా
ఘట్‌కేసర్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ ఎల్బీనగర్ జోన్ పోచారం సర్కిల్ పరిధిలోని కొర్రెములలో పార్కు స్థలం కబ్జా చేసి నిర్మించిన ప్రహరీని సోమవారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 747, 750లో ఉన్న 1034 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేసి ప్రహారీ నిర్మించగా గతంలో హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయినప్పటికీ మరోసారి కబ్జాదారులు మళ్లీ నిర్మాణాలు చేపట్టారు.
దీంతో స్థానికులు హైడ్రా అధికారు లకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు మరోసారి కూల్చివేతలు చేపట్టారు. లేఅవుట్ లలో పార్కు స్థలాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.