23-12-2025 12:04:18 AM
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్
కామారెడ్డి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో గ్రామాలు పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర ఖంజాబ్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నూతన సర్పంచ్ ఐరన్ నరసయ్య పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో వీరవత్రి అనిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం గ్రామాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు రైతు భరోసా రైతు బీమా కల్పిస్తున్నాము రైతులకు అన్ని రకాలుగా అండగా ప్రభుత్వం ఉంటుందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగం ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఆహారభద్రత కింద తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. వృద్ధులకు వికలాంగులకు, మహిళలకు, బీడీ కార్మికులకు ,చేనేత కార్మికులకు ,ప్రతినెల ఆసరా పెన్షన్ అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు నిరుపేదలకు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నామన్నారు. ఎమర్జెన్సీ కోసం108 ఉచిత అంబులెన్స్ సేవలు ప్రతి మండలంలో అందజేస్తున్న అన్నారు.
దోమకొండ గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా నిధులు మంజూరుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి పనుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. సన్మాన కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ,జిల్లా యువజన నాయకులు ఇలియాస్, బీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్ర కరణ్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ ఆయా మండలాల కాంగ్రెస్ నాయకులు దోమకొండ సర్పంచ్ ఐరన్ నరసయ్య ,ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులు చేత మండల ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పదవీ ప్రమాణ శ్రీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆయా కుల సంఘాల ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు