calender_icon.png 10 November, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శవాల మీద దాపరికమెందుకు?

10-11-2025 12:33:47 AM

మాగంటి మరణంపై కేటీఆర్ సమాధానం చెప్పాలి

జూబ్లీహిల్స్ ప్రచారంలో మంత్రి సీతక్క

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): మాగంటి గోపినాథ్ మరణంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని, శవాల మీద దాపరికమెందుకు అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచార చివరి రోజున కాంగ్రెస్ పార్టీ బోరబండ డివిజన్‌లో అదివారం మంత్రి సీతక్క నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి కదం తొక్కాయి. ఈ ర్యాలీకి ఎంపీ మల్లు రవి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, నాయిని రాజేందర్ రెడ్డి, రామచంద్రనాయక్, యశస్విని రెడ్డి, మందుల శామ్యూల్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, అందుకే సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయని అన్నారు. ఒక్క బోరబండ డివిజన్లోనే రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

గత బీఆర్‌ఎస్ పాలనలో రేషన్ కార్డు లేక పేదలు ఉచిత వైద్యాన్ని కూడా అందుకోలేకపోయారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై సీతక్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాగంటి మరణంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని కోరారు. శవాల మీద దాపరికాలు ఎందుకు? మీ దోపిడీ బయటపడుతుందనే భయంతోనే మౌనంగా ఉన్నారా? అని నిలదీశారు.