calender_icon.png 14 October, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.12.30 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం

14-10-2025 12:44:45 AM

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు, అక్టోబర్ 13 : తెల్లాపూర్ మున్సిపాలిటీ ముత్తంగి గ్రామ పరిధిలోని వివిధ కాలనీలలో రూ.12.30 కోట్లతో అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముత్తంగి పరిధిలోని నూతన కాలనీలలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధికి నిధులు కేటాయించామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం..

పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి పథకం ద్వారా 67 లక్షల రూపాయలతో నిర్మించిన 4 అదనపు తరగతి గదులు, ఆర్డిసి కాంక్రీట్ ఇండస్ట్రీస్ సిఎస్‌ఆర్ నిధులతో 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మరో రెండు అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు.

పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంతో పాటు ఆధునిక వసతులతో విద్యాబోధనను అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రూ.10 లక్షలతో సిఎస్‌ఆర్ నిధులతో పాఠశాలకు రంగులు వేయించడం జరిగిందనిపేర్కొన్నారు.