calender_icon.png 9 August, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

09-08-2025 12:00:00 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

 జగిత్యాల అర్బన్, ఆగస్టు 8 ( విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డా క్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారంజగిత్యాల పురపాలక సంఘం అధికారులతో  శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ బి ఎస్ లత స మీక్ష సమావేశం నిర్వహించారు.పట్టణంలో నూతనంగా మంజురైన రోడ్లు త్వరిత గతిన పూర్తి కి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.పట్టణ పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారిం చాలన్నారు.

తడి, పొడి చెత్త సేకరణ పై ము న్సిపల్ అధికారులు, వార్డు అధికారులు ప్ర జలకు అవగాహన కల్పించాలని,రెవెన్యూ, శానిటరీ విభాగం చిత్త శుద్ధి తో పనిచేయాలని సూచించారు.నూతన నిర్మాణాలు లేఔ ట్,చట్ట బద్ద అనుమతి తోనే నిర్మాణాలు చేపట్టాలని,వార్డు అధికారి నిరంతర పర్యవేక్షణ ఉండాలని,సమస్య ఉంటే ఉన్నత అ ధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.బీట్ బ జార్ లో రు.4 కోట్ల 50 లక్షలతో నిర్మించిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభోత్స వం,పెండింగ్ పనుల పూర్తి కి చొరవ తీసుకోవాలన్నారు.

పట్టణంలో జరుగుతున్న, వాయిదా పడిన పనుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని,అవసరమైతే ఉన్నత అధికారుల అనుమతి తీసుకొని వార్డులో ఇతర ప్రదేశాలలో మార్పు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, డి ఈ ఆనంద్, మెప్మ ఏవో శ్రీనివాస్, ఏయి లు శరన్, అనిల్, రెవెన్యూ,ఇంజనీర్ అధికారులు,శానిటరీ విభాగం, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.