calender_icon.png 13 May, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్ మిల్లర్లు లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి

12-05-2025 12:08:17 AM

జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్

మంచిర్యాల, మే 11 (విజయక్రాంతి) : రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన వరి ధా న్యం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. ఆదివారం జిల్లాలోని దండేపల్లి మండలం కన్నెపల్లి లో గల శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్, రంగపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, హాజీపూర్ మండలం నంనూర్, గుడిపేట గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని, కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యం లోడును తక్షణమే దిగుమతి చేసుకొని వాహనాలను తిరిగి పంపించాలని తెలిపారు.

రైస్ మిల్లులకు కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, సి.ఎం.ఆర్. లక్ష్యాల సాధన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైతే హమాలీల సంఖ్య పెంచుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుండి వస్తున్న ధాన్యం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల అదనపు బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు.

వరి ధాన్యం విక్రయించేం దుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, నీడ, ఓ.ఆర్.ఎస్. సౌకర్యాలు కల్పిం చడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు రశీదు జారీ చేయాలని, రైతులు, ధాన్యం వివరాలను ట్యాబ్లలో నమోదు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.