calender_icon.png 12 August, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గరిడేపల్లిలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

11-08-2025 10:17:27 PM

గరిడేపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వం వైద్య ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గరిడేపల్లి తహసిల్దార్ బండ కవిత(Tahsildar Banda Kavitha) కోరారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. పిల్లల్లో నులిపురుగుల నిర్మల కోసం చేపడుతున్న కార్యక్రమానికి వైద్య ఆరోగ్య సిబ్బందికి అందరు సహకరించాలని ఆమె కోరారు. మండల వైద్యాధికారి డాక్టర్ వి నరేష్ మాట్లాడుతూ, ఏడాది వయసు నుంచి 19 సంవత్సరాల పిల్లలకు నులిపురుగులను నిర్మూలించేందుకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ మాత్రల వలన పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించవచ్చని, రక్తహీనతను, అలసటను తగ్గించవచ్చు అని తెలిపారు. ఈ మాత్రలు అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరోగ్య కేంద్రాలలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న 2,418 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ,మండల విద్యాధికారి చత్రు నాయక్,ఎం.పీ.ఓ ఇబ్రహీం,హెల్త్ సూపర్వైజర్ ఎన్ అంజయ్య గౌడ్,వెంకటరమణ,ఏపీవో సురేష్,ఏఎన్ఎంలు కవిత,అంజలి,ఆశా కార్యకర్తలు ఉమా,సైదమ్మ,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.