11-08-2025 10:22:03 PM
కల్తీసారా తాగి చచ్చిపోతున్నారు.. సారా తాగద్దు
గుడుంబా తయారుచేసే వాడు, అమ్మేవాడు, కోనేవాడు నేరస్తులే
ఎస్సై ఇనిగాల వెంకటేష్
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవులా గ్రామంలో నడీ రోడ్డుపై ఓ వృద్ధుడు పడి ఉన్నాడు. అటుగా వెలుతున్న ప్రయాణికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించారు. అతని దగ్గర నాటుసారా వాసన రావడంతో నాటుసారా తాగి అదే మత్తులో ఉన్నాడని పోలీసులు గమనించారు.
వెంటనే నీళ్ళు తట్టి లేపారు లేచిన మందు బాబుని ఇంటికి తీసుకుని వెళ్లి ఇంట్లో వారి ముందు స్థానిక ఎస్సై ఇనిగాల వెంకటేష్(SI Inigala Venkatesh) మాట్లాడుతూ, మీరు తాగుగుతున్న నాటుసారా కల్తీ, అలాంటి నాటుసారా తాగి చచ్చిపోతున్నారని చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వారికి అవగాహన కల్పించారు. కల్తీ సారా(గుడుంబా) తాగద్దని హెచ్చరించారు. నాటుసారా తయారుచేసే వాడు, నాటుసారా అమ్మేవాడు, కోనేవాడు నేరస్తులు అవుతారని అన్నారు. నాటుసారా గుడుంబా విక్రయిస్తున్న అక్రమార్కులు పద్దతి మార్చుకోవాలని లేనియెడల ఎన్‌డీపీఎస్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేస్తామని, 6 నెలల వకు బెయిల్ కూడా రాదని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.