14-05-2025 12:00:00 AM
మలక్పేట్, మే 13 (విజయ క్రాంతి): సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విక లాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్ పిఆ ర్‌డి) ఆధ్వర్యంలో మలక్పేట్ లోని దివ్యాంగుల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. ఎన్ పిఆర్ డి ప్రధాన కార్యదర్శి అడివయ్యా మాట్లాడుతూ రాష్ట్రంలో నలు పు లక్షల మంది పైగా దివ్యాంగులు ఉంటే కేవలం నాలుగు లక్షల వరకే దివ్యాంగులకు అందుతున్నాయని తెలిపారు.
మిగతా వారికి పెన్షన్ అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వికలాంగుల పెన్ష న్ రూపాయిలు 6000 పెంచాలని డిమాం డ్ చేశారు. దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ అమలు చేసిన సంక్షేమ పథకాల్లో ప్రభుత్వ శాఖలన్నీ ఐదు శాతం వికలాంగులకు కేటాయించి అమలు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి అధ్యక్షుడు వెంకట్, కోశాధికారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా సహకార సంస్థ జిఎం జనరల్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేసి తమ సమ స్యలను వివరించారు. జిఎం ప్రభంజన్ రా వు సానుకూలంగా స్పందిస్తూ దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.