30-08-2025 12:39:30 AM
తాండూరు, 29 ఆగస్టు, (విజయ క్రాంతి) : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా యాలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో ఉపాధ్యాయులు, విద్యా ర్థులు స్వర్గీయ ధ్యాన్చంద్ చిత్రపటా నికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా పాఠ శాల ప్రిన్సిపల్ గ్రాజుల సిద్ధిరా మేశ్వర్ మాట్లాడుతూ దేశభక్తి , గొప్ప క్రీడా స్ఫూర్తి కలిగిన క్రీడా కారుడు స్వర్గీయ ధ్యాన్చంద్ అని అన్నారు. దేశం కోసం ఒలంపిక్స్ లో వరుసగా మూడు బంగారు పత కాలు సాధించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో పట్టుదల క్రమ శిక్షణతో ఆయన సాధించిన విజ యాల గురించి విద్యార్థులకు వివరిం చారు. ఉపాధ్యాయులు వెంకటప్ర సాద్, మంగళ డోకి, రాజశేఖర్, ఫిజి కల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.