15-10-2025 12:29:01 AM
రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్‌ని కలసిన దేవరకద్ర ఎమ్మెల్యే జియంఆర్
దేవరకద్ర, అక్టోబర్ 14 : దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో అండర్పాస్, సబ్ వే నిర్మాణానికి సంబంధించి వర్క్ శాంక్షన్స్ ఇవ్వాలని,మదనపురం రైల్వే గేట్ వద్ద వాహనాలు పెరిగి, అధిక రద్దీ కారణంగా తీవ్ర ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అండర్పాస్,ఆర్‌ఓబీ నిర్మించాలని రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ నికలిసి వినతిపత్రంను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధు సూదన్ రెడ్డి అందజేశారు
. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన రైల్వే జనరల్ మేనేజర్ ఉదయ్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మెంబర్ మన్నె జీవన్ రెడ్డి పాల్గొన్నారు.