22-12-2025 01:03:23 AM
ప్రతిభయనెడిది ఒకని సొత్తు కాదు
నలుపు తెలుపు రంగులు అడ్డు కాదు
కవి కోకిల జాషువాయే ఋజువు
కులమతాల గోడలు అడ్డు కాదు
&.
పైకి కఠినం అనిపిస్తాడు నాన్న
లోన వెన్నలా కరుగుతాడు నాన్న
పిల్లల్ని దండించిక కుములుతాడు
మొక్కల్ని పెంచు తోటమాలి నాన్న
&.
మనసు తలుపులు కొంచెం తెరిచిఉంచు
నీ చుట్టూ చూపుల వల పరచిఉంచు
కవిత్వపు మీనాలు చిక్కవచ్చును
కలము కాగితములను తెరిచేఉంచు
సింగారపు రాజయ్య